నవతెలంగాణ – బిచ్కుంద
వర్షాల కారణంగా చిక్కుకున్న పెళ్లికి వెళ్లి వస్తున్న వారికి రెవెన్యూ అధికారులు పునరావాసం ఏర్పాటు చేశారు. భారీ వర్షాలు పడడంతో మండలంలోని మెక్కా గ్రామం చుట్టూ నీరు చేరడం పెళ్లికి వెళ్లిన వారు తిరిగి మెక్క గ్రామానికి వెళ్లలేక మధ్యలో ఆగిపోయిన వారితో తహసిల్దార్ వేణుగోపాల్ మాట్లాడి షెట్లూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వారికోసం పునరావాసం ఏర్పాటు చేసి టిఫిన్లు, భోజన సదుపాయాలు కల్పించారు. నేటి ప్రవాహం తగ్గేవరకు ఇక్కడే ఉండాలని తహసిల్దార్ వారికి సూచించారు. ఖథ్గాం నుండి బీర్కూరు వెళ్లే దారి నీటితో ప్రమాదకరంగా మారడంతో దారిని మూసివేశారు. రాజల్లా వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తుండడంతో బిచ్కుంద నుండి రాజుల గ్రామానికి వెళ్లే దారిలో బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు.
నిన్న కురిసిన భారీ వర్షానికి బిచ్కుంద మున్సిపల్ పరిధిలోని దౌల్తాపూర్ లో గంగమణి భూంగొండ ఇల్లు కూలిపోవడంతో కమిషనర్ హయ్యం కూలిపోయిన ఇల్లును పరిశీలించి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని కమ్యూనిటీ హాల్ లోకి తరలించి పునరావాసం కల్పించారు. ఆగకుండా వర్షాలు కురుస్తున్న తరుణంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాగులో, కుంట్లలో చర్లలోని నీళ్లు తాగరాదని కాచి చల్లార్చిన నీటినే తాగాలని ఎలాంటి సమస్యలున్న అధికారులకు తెలియజేయాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవీందర్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఉన్నారు.
పునరావాస కేంద్రం ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారులు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES