నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
వినాయక చవితి పండగ సందర్భంగా తమ గ్రామంలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించడానికి వినాయక చవితి పండగ రోజు లింగంపల్లి గ్రామానికి చెందిన ఎనిమిది మంది యువకులు సరిహద్దు జిల్లా అయినటువంటి మెదక్ జిల్లాకు గణపతి తీసుకురావడానికి వెళ్లడం జరిగింది. బుధవారం ఉదయం నుండి విపరీతమైన వర్షం కురవడంతో ఘన్పూర్ మండలం నాగపూర్ గేటు వద్ద నీటి వరద పెరిగి వరదలో కారు కొట్టుకపోవడంతో అది చూసిన యువకులు తిరిగి ఇంటికి వెళ్లి పోదామని, పోచమ్మ రాళ్ల వరకు తిరిగి రాగా పోచారం ప్రాజెక్టులో విపరీతమైన వరద రావడంతో పోచారం ప్రాజెక్టు నుండి పొంగిపోతున్న వరద తాకిడికి ప్రాజెక్టు వద్ద రోడ్డు కోతకు గురి కావడంతో ఇటు రాలేక అటు వెళ్లలేక పోచమ్మ రాల్ తండా వద్దే యువకులు ఇరుక్కుపోయారు. రెండు రోజులపాటు ఎటూ దారి లేక పోచమ్మ రాల్ గ్రామపంచాయతీలోనే బస చేశారు. గ్రామస్తులు భోజనం పెట్టడంతో అక్కడే ఉండిపోయారు. శుక్రవారం రోజు రిస్క్ టీం యువకులను ప్రాజెక్టు వరద దాటిద్దాం అని ప్రయత్నం చేయగా వరద ఉధృతికి సాధ్యపడలేదు తిరిగి యువకులను ఘన్పూర్ గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో పునరావాసం కల్పించడం జరిగింది. వరద ఉదృతి తగ్గగానే యువకులను గమ్యానికి చేరుస్తామని పోలీసులు పేర్కొన్నారు.
గణపతి విగ్రహం కోసం వెళ్లి పోచమ్మ గ్రామంలో ఇరుక్కుపోయిన యువకులు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES