నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్స,ర్, ఆర్డీవో రాజేందర్లు కలిసి శుక్రవారం నగరంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు గంగాస్థాన్, వినాయక్ నగర్‌లోని గుపన్‌పల్లి గోడౌన్‌లోని సెల్టర్ హోమ్‌లను, బింగి కల్యాణ మండపాన్ని తనిఖీ చేశారు. అక్కడ ఉన్న ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి అక్కడున్న వారికి ఇలాంటి సమస్యలు లేకుండా చూడాలని కలెక్టర్ కిరణ్ కుమార్ సంబంధిత సిబ్బందికి ఆదేశించారు. తరువాత కమిషనర్ దిలీప్ కుమార్ బోర్గాం పంగ్రా వాగును తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రవిబాబు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంబంధిత మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్లు, శానిటరీ సూపర్‌వైజర్, సంబంధిత శానిటరీ ఇన్‌స్పెక్టర్లు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాలలో తనిఖీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES