- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. నాలుగైదు రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి. నేడు ఉభయసభల్లోనూ సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. ఇటీవల మృతిచెందిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌పై అసెంబ్లీలో, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డిపై మండలిలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి నివాళులర్పిస్తారు. ఈ తీర్మానాలపై చర్చ అనంతరం సమావేశాలు వాయిదా పడతాయి. అసెంబ్లీ, మండలిలో వేర్వేరుగా నిర్వహించనున్న బీఏసీ సమావేశాల్లో ఎన్ని రోజుల పాటు సభలను నిర్వహించాలనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటారు.
- Advertisement -