Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుమాగంటి గోపినాథ్ మాస్ లీడర్..అసెంబ్లీలో మాగంటి గోపినాథ్ మృతికి సీఎం సంతాపం

మాగంటి గోపినాథ్ మాస్ లీడర్..అసెంబ్లీలో మాగంటి గోపినాథ్ మృతికి సీఎం సంతాపం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : శనివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఇవాళ ఉదయం ప్రారంభమైన సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతికి సంతాపం తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మాగంటి గోపినాథ్ మరణం ఆయన కుటుంబానికి తీరని లోటు అని అన్నారు. ఆయన చూడటానికి క్లాస్ గా కనిపించినప్పటికీ మాస్ లీడర్ అని అన్నారు. 

విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారని.. 1983లో ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీలో క్రీయాశీలక సభ్యుడి చేరి.. ఆ పార్టీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా 7 సంవత్సరాలు సేవలు అందించారని.. ఎన్టీఆర్ పరమ భక్తుడిగా కొనసాగారని అన్నారు. హైదరాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ డైరెక్టర్ గా వినియోగదారుల ఫోరం సభ్యుడిగా వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు.సినిమా రంగంలోనూ నిర్మాతగా, విద్యార్థి రాజకీయ నాయకుడిగా.. టీడీపీలో ఎదిగారని అన్నారు.తనకు వ్యక్తిగతంగానూ మంచి మిత్రుడని..  2014లో నేను రెండోసారి ఎమ్మెల్యేగా.. మాగంటి మొదటి సారి ఎమ్మల్యేగా మొదటిసారి కలిసి సభలో పని చేశామని అన్నారు సీఎం రేవంత్. రాజకీయ విధానాల్లో మార్పు వచ్చినా.. వ్యక్తిగత మిత్రుడిగా ఉన్నారని అన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారని.. ఆయన లేని లోటు తీర్చనిది.. జూబ్లిహిల్స్ ప్రజలు మంచి నాయకుడిని కోల్పోయారని అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad