నవతెలంగాణ – గాంధారి
కామారెడ్డి జిల్లాలో అకాల వర్షంతో వేల ఎకరాలు పంటనష్టం వాటిల్లిందని వరి, మక్కాజొన్న, సోయా పత్తి పంటలు విపరీతంగా నష్టం జరిగిందని ప్రభుత్వ అధికారులు వెంటనే సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గాంధారి మండలంలోని రామ లక్ష్మణ్ పల్లి గ్రామంలో పంట పొలాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటతోపాటు ఇండ్లు కూలిపోయిన పశువులు చనిపోయిన వారికి కూడా వాటిని పరిశీలించి ఆర్థిక సాయం చేసి వంట సామాగ్రులు బట్టలు వెంటనే ఇప్పించాలని కోరారు.
ఈ నష్టం జరగకుండా ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు చెప్పకపోవడం ఈ నష్టానికి కారణమైందన్నారు. అందుకనే రైతు సంఘం ఆధ్వర్యంలో రామలక్షణపల్లి ,గాంధారి ,తిప్పారం తదితర ప్రాంతాలకు బృందం పరిశీలించిందని అన్నారు. రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిందని వెంటనే మరమ్మతులు చేయాలని అన్నారు. హైవేలో రోడ్డు ఇంత తొందరగా కూలిపోవడానికి కారణం కాంట్రాక్టులు అన్నారు. నైజాం కాలం నుంచి ఉన్న బ్రిడ్జిలు చెక్కుచెదరకుండా ఉన్నాయి కానీ ఐదేళ్లు నిండ్లని హైవే రోడ్లు మాత్రం తుక్కుతుక్కుపోయి కూలిపోయినయని అన్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ప్రకాష్, సక్రు నాయక్, గంగు నాయక్ మీనా రైతులు తదితరులు పాల్గొన్నారు.
భారీ వర్షంతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25వేలు ఇవ్వాలి: వ్యకాస
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES