Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కలెక్టర్ ను కలిసిన ఎంప్లాయిస్ జేఏసీ ఉద్యోగులు 

కలెక్టర్ ను కలిసిన ఎంప్లాయిస్ జేఏసీ ఉద్యోగులు 

- Advertisement -

సెప్టెంబర్ 1 నుండి జిల్లాలో నిర్వహించే ఉద్యమ కార్యచరణ నిరసన కార్యక్రమాలపై వినతి 
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని శనివారం ఎంప్లాయిస్ జేఏసీ పక్షాన ఐ డి ఓ సి కార్యాలయం లోని ఆయన చాంబర్లో కలిశారు. ఉద్యోగుల సమస్యలపై  ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర కమిటీ విడుదల చేసిన కార్యాచరణకు అనుగుణంగా సెప్టెంబర్ 1వ తేదీ నుండి జిల్లా కేంద్రంలో నిర్వహించే ఉద్యమ కార్యచరణ, నిరసన కార్యక్రమాల వివరాలను తెలియజేసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్ టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, కో చైర్మన్లు రమణ రెడ్డి , ధర్మేందర్, వైస్ చైర్మన్లు నేతికుంట శేఖర్, ప్రశాంత్, రమణాచారి,  జమీల్ ఉల్లా, ఫైనాన్స్ సెక్రటరీ జాకీర్ హుస్సేన్, కార్యవర్గ సభ్యులు చిట్టి నారాయణరెడ్డి,పోల శ్రీనివాస్, జాఫర్ హుస్సేన్, మాణిక్యం, మంగమ్మ, శ్రీవేణి, గీతారెడ్డి,సునీల్, స్వామి, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad