వినూత్న రీతిలో యువకుల ప్రచారం
నవతెలంగాణ – దుబ్బాక
చదువులు, ఆటపాటలతో హాయిగా గడపాల్సిన బాల్యం.. మొబైల్ ఫోన్ల వల్ల నాలుగు గదుల మధ్యనే బంధీ అవుతుందని, మొబైల్ ఫోన్లను వాడడం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరిస్తూ.. దుబ్బాక పట్టణ కేంద్రంలోని యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ వారు నెలకొల్పిన గణేష్ మండప మండప నిర్వాహకులు వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. “మొబైల్ ఫోన్ కట్టిపెట్టు చిన్నారుల భవిష్యత్తుపై దృష్టి పెట్టు”, “అరచేతిలో స్వర్గం బతుకుంతా నరకం” అంటూ మొబైల్ ఫోన్ల వల్ల కలిగే దుష్పరిణామాలను కళ్లకు కట్టినట్లుగా వివరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పిల్లల భవిష్యత్తు పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలియజేస్తున్న యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యుల కృషిని పట్టణవాసులు అభినందిస్తున్నారు.
మొబైల్ ఫోన్ కట్టి పెట్టు.. భవిష్యత్తు పై దృష్టి పెట్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES