నవతెలంగాణ-హైదరాబాద్: మాజీ ఉక్రెనియన్ పార్లమెంటరీ స్పీకర్ ఆండ్రిరు పరుబిరు ఎల్వివ్ నగరంలో శుక్రవారం దారుణ హత్యకు గురయ్యాడు. ఓ దుండగడు ఆండ్రిరుపై బుల్లెట్ల వర్షం కురింపించాడు. తుపాకీతో అతి దారుణంగా కాల్చి చంపి పరారయ్యాడు. ఈ హత్యను ఉక్రెయిన్ అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. ఆయన మృతి పట్ల జెలెన్‌స్కీ విచారం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఇహోర్ క్లైమెంకో, ప్రాసిక్యూటర్ జనరల్ రుస్లాన్ క్రావ్‌చెంకో తెలిపారని.. ఆండ్రిరు కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలుపుతున్నట్లు జెలెన్‌స్కీ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ఇక ఈ హత్య ఘటనపై తాను అవసరమైన చర్యలన్నింటనీ తీసుకుంటానని చెప్పారు. ఈ ఘటనపై ఆయన దర్యాప్తుకు ఆదేశించారు. పరుబిరు రాజకీయ నేత. ఈయన 2010లో పార్లమెంటరీ స్పీకర్‌గా పనిచేశారు.
ఉక్రెయిన్‌లో మాజీ స్పీకర్ దారుణ హత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES