నవతెలంగాణ – చారకొండ
స్వచ్ఛంద సేవ సంస్థల సహకారంతో శనివారం మండల కేంద్రంలో మండల వైద్య అధికారులు డాక్టర్ మంజు భార్గవి, డాక్టర్ సృజన ఆధ్వర్యంలో సమగ్ర వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డిప్యూటీ డీఎంహెచ్ ఓ భీమా నాయక్, తహాసిల్దార్ అద్దంకి సునీత, వెల్దండ సీఐ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్సై శంషుద్దీన్ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డి ఎం హెచ్ ఓ భీమా నాయక్ మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు దరిచేరవని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
వైద్య శిబిరంలో 73 మందికి క్షయ (టీబీ) పరీక్షలు చేయడంతో 11 మందికి పాజిటివ్ రావడంతో వీరిని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం జరుగుతుందని మండల వైద్యాధికారి డాక్టర్ మంజు భార్గవి తెలిపారు. 200 మందికి మధుమేహ పరీక్షలు నిర్వహించగా 50 మందికి మధుమేహం ఉన్నట్లు తెలిపారు. వైద్య శిబిరంలో హెచ్ఐవి, క్షయ వ్యాధి, మధుమేహ, బిపి, జ్వరాలు, సర్ది, దగ్గు తదితర వ్యాధులకు పరీక్షలు నిర్వహించారు. మధుమేహ, బిపి, జ్వరం, జలుబు, దగ్గు వ్యాధులకు మందులు పంపిణీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో సిహెచ్ఓ శ్రీనివాసులు, ఎం పి హెచ్ ఓ ఎన్డీవి చారి, పి హెచ్ ఎన్ కృపమ్మ, డివిజన్ అధికారి శ్రీనివాసులు, డివిజన్ టీబీ అధికారి గౌరి, ఎం ఎల్ హెచ్ పి ప్రియాంక, ఏఎన్ఎం అలివేలు, టెక్నీషియన్లు, ఆశ వర్కర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండె వెంకట్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జమ్మికింది బాల్ రాం గౌడ్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ గజ్జ యాదయ్య గౌడ్, మాజీ జెడ్పిటిసి భీముడు నాయక్, టిడిపి మండల అధ్యక్షుడు సండూరి శ్రీనయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సమగ్ర వ్యాధి ఉచిత వైద్య శిబిరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES