- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంట్లో చొరబడి 30 తులాల బంగారం, లక్ష రూపాయల నగదు చోరీ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆసిఫాబాద్ పట్టణంలోని రాజంపేట కాలానికి చెందిన పద్మ సత్యనారాయణ స్వామి పూజ కోసమని శనివారం సాయంత్రం ఇంటికి తాళం వేసి సమీప గ్రామమైన గుడికి వెళ్లింది. రాత్రి ఆలస్యం కావడంతో అక్కడే ఉండిపోయింది. ఉదయం వచ్చి ఆమె చూసేసరికి ఇంటికి వేసిన తాళం పగులగొట్టి.. ఇంట్లో ఉన్న 30 తులాల బంగారంతో పాటు లక్ష రూపాయలు దొంగిలించినట్లు బాధితులు తెలిపారు. పోలీసులు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.
- Advertisement -