– తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.ఆనందాచారి
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆరుద్ర సాహిత్యం జనహితాన్ని ప్రతిబింబిస్తుందని తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.ఆనందాచారి అన్నారు. తెలంగాణ సాహితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కవులు, రచయితలు ఎంహెచ్ భవన్ లో ఆరుద్ర శతజయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆనందాచారి మాట్లాడుతూ… కవి, రచయిత, అనువాదకుడు, గేయరచయిత, నాటకకర్త, ప్రచురణకర్త, తెలుగు సాహిత్య నిపుణుడు అయిన ఆరుద్ర, తన రచనల ద్వారా సామాన్యులను, ప్రజాసామాన్యాన్ని ప్రభావితం చేశారని తెలిపారు. ఆయన అభ్యుదయ రచయితగా ఉంటూ, ప్రజల జీవితాలను ప్రతిబింబించే రచనలు చేశారని చెప్పారు. ఆయన సూచించిన అభ్యుదయ బాటలో నేడు తెలంగాణ సాహితి ప్రయాణిస్తుందని అన్నారు. ముందుగా ఆరుద్ర చిత్రపటానికి సీనియర్ కవి, రచయిత సత్యభాస్కర్, ఆనందాచారి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సభలో తెలంగాణ సాహితి రాష్ట్ర ఉపాధ్యక్షులు అనంతోజు మోహన్ కృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి సలీమ, రంగారెడ్డి జిల్లా నాయకులు, సీనియర్ కవి, రచయిత బండి సత్తన్న, హైదరాబాద్ నగర కార్యానిర్వహక కార్యదర్శి శరత్ సుదర్శి, నాయకులు సయ్యద్ ముజాహిద్ అలీ, అజయ్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
ఆరుద్ర సాహిత్యం జనహితం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES