నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండలంలోని అనంతారం ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఆదివారం ఉదయం 5.30 తెల్లవారుజామున ప్రాంతంలో డివైడర్లు ఢీకొనే ముగ్గురు యువకులు గాయాలపాలైన సంఘటన చోటుచేసుకుంది. వరంగల్ జిల్లాకు చెందిన ముగ్గురు హైదరాబాదులో ఖైరతాబాద్ దగ్గర వినాయకుని నిమర్జనం చేసుకొని, తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ నుంచి వరంగల్ కు వెళ్తుండగా మార్గమధ్యంలో తెల్లవారుజామున 5:30కు ఏమి కనపడకపోవడం వలన డివైడర్ కు ఢీకొట్టి కింద పడిపోయారు. గుండెబోయిన వెంకట్ , ఎండి అష్రాఫ్, దామన్, ముగ్గురి యువకులను భువనగిరి 108 అంబులెన్స్ లో భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.అక్కడ నుంచి మెరుగైన వైద్య చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి వెళ్లాలని డాక్టర్లు సూచించారు. ప్రస్తుతం వీళ్ళ యొక్క పరిస్థితి విషమ పరిస్థితిగా ఉంది ఫోన్ రాగానే 108 సిబ్బంది అక్కడకు చేరుకొని జిల్లా ఆసుపత్రికి ప్రధమ చికిత్స అందిస్తూ తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అనంతారం ఫ్లైఓవర్ వద్ద డివైడర్ ఢీకొని ముగ్గురికి గాయాలు…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES