నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు గుడ్‌న్యూస్. రేపటి నుంచి (సెప్టెంబర్ 1) రాగి జావ పంపిణీ చేయనున్నారు. ఈ పథకం ద్వారా విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే సుమారు 18 లక్షల మంది విద్యార్థులకు ఈ రాగిజావ అందించనున్నారు. ఈ విద్యా సంవత్సరంలో కూడా శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ సహకారంతో ఈ పథకం అమలు చేయనున్నారు. రాగిజావ తయారీకి అవసరమైన రాగి పౌడర్, బెల్లం పౌడర్‌ను ఈ ట్రస్ట్ పాఠశాలలకు సరఫరా చేస్తోంది. ప్రతి గ్లాస్ రాగిజావ తయారు చేసి అందించినందుకు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లకు (SHG) రోజుకు 25 పైసల చొప్పున చెల్లించనున్నారు.ఈ పథకం కోసం ఏటా సుమారు రూ.35 కోట్ల నిధులు అవసరమని అంచనా వేశారు. ఇందులో 60 శాతం ఖర్చును శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ భరిస్తుండగా.. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం అందిస్తుంది.
తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES