నవతెలంగాణ-కమ్మర్ పల్లి :మండల కేంద్రంలో ఆదివారం గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన స్నేహితుని జ్ఞాపకార్థం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినిలకు పుస్తకాలు, పెన్నులు, పండ్లు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన సుంకేట రవి అనే వ్యక్తి ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఉన్నతా చదువుల కోసం అని ఆస్ట్రేలియా వెళ్లాడు. ఐదు సంవత్సరాలు ఆస్ట్రేలియాలో గడిచిన తర్వాత ఎమ్మెస్సీ పూర్తిచేసుకుని గత సంవత్సరం స్వగ్రామానికి విచ్చేశాడు. వచ్చిన పది రోజుల తర్వాత ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లిన సుంకేట రవి ఇంటికి వస్తుండగా లారీ ఢీకొని రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నేటితో రవి మృతి చెంది ఒక సంవత్సరం గడిచిన నేపథ్యంలో అతని జ్ఞాపకార్థం, అతని స్నేహితులు, బంధువులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినిలకు పుస్తకాలు, పెన్నులు పండ్లు అందజేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవలు కార్యక్రమాలు తమ స్నేహితుడు సుంకేట రవి జ్ఞాపకార్థం కొనసాగిస్తామని అతని స్నేహితులు తెలిపారు. కార్యక్రమంలో వేముల సాయి రెడ్డి, జైడి బాలకృష్ణ, కొమ్ముల మైపాల్, బద్దం రాజేష్, జడల జితేందర్, జడల మణికంఠ, అఖిల్, రోహిత్, స్వామి, బంధుమిత్రులు, తదితరులు పాల్గొన్నారు.
స్నేహితుని జ్ఞాపకార్థం పెన్నులు, పండ్లు పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES