- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని రథం గల్లి లోని శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయంలో ఏర్పాటుచేసిన షేత్కరి గణేష్ మండలి 50వ వార్షికోత్సవం నవరాత్రి ఉత్సవ వేడుకలు నిర్వాహకులు ఆధ్వర్యంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిత్య అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. ఆదివారం రాత్రి 7 గంటల నుండి అన్న ప్రసాదం ప్రారంభమవుతుందని ఈ అన్న ప్రసాదంలో గ్రామస్తులు పాల్గొనాలని నిర్వాహకులు ఒక ప్రకటన ద్వారా విలేకరులకు తెలిపారు. షేత్కరి గణేష్ మండలి ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వాహకులు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
- Advertisement -