No menu items!
Monday, September 1, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeఆదిలాబాద్15 క్వింటాళ్ల నకిలీ డిటర్జెంట్ స్వాధీనం

15 క్వింటాళ్ల నకిలీ డిటర్జెంట్ స్వాధీనం

- Advertisement -
  • – నలుగురిపై కేసు.. ముగ్గురు అరెస్ట్
  • – కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ
  • నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్: మహారాష్ట్ర నుండి ఆదిలాబాద్ కు తరలిస్తుండగా  నకిలీ డిటర్జెంట్ ను పోలీసులు పట్టుకున్నారు. 15 క్వింటల్లా నకిలీ డిటర్జెంట్ ను స్వాధీనం చేసుకున్నట్లు  డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. ఆదివారం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. పట్టణానికి చెందిన రూపేష్ అగర్వాల్ అనే వ్యక్తి అమరావతి నుండి నకిలీ గడి డిటర్జెంట్ ను తీసుకువచ్చి ఆదిలాబాద్, మహారాష్ట్రలోని జివితి ప్రాంతానికి చెందిన వ్యాపారులకు అమ్మే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు.
  • ఈ క్రమంలో తాంసి బస్టాండ్ ప్రాంతంలో విశ్వసనీయ సమాచారం మేరకు టూ టౌన్ ఎస్సై విష్ణు ప్రకాష్, సిబ్బంది బొలెరో వాహనంలో 60 బ్యాగులలో దాదాపు 15 క్వింటల్లా నకిలీ డిటర్జెంట్ ఒక కిలో ప్యాకెట్లను తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందని పేర్కొన్నారు. పట్టణంలో ఎలాంటి నకిలీ వాటిని చలామణిలో ఉన్న తగిన సమాచారాన్ని పోలీసు వ్యవస్థకు అందజేయాలని వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. కేసు నమోదైన నలుగురిలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఏ ఫోర్ నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు, ఎస్సై విష్ణు ప్రకాష్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad