Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeఆటలుఫిట్‌నెస్‌ ఉద్యమంలా 'సైక్లింగ్‌'

ఫిట్‌నెస్‌ ఉద్యమంలా ‘సైక్లింగ్‌’

- Advertisement -

రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

నవతెలంగాణ-హైదరాబాద్‌ :
ఆరోగ్యవంతమైన సమాజం కోసం ‘సైక్లింగ్‌ ఆన్‌ సండేస్‌’ కార్యక్రమాన్ని ఫిట్‌నెస్‌ ఉద్యమంలా నిర్వహించాలని, ఆరోగ్యం కోసం ప్రతి రోజు అర గంట కేటాయించాలని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సూచించారు. జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సైక్లింగ్‌ కార్యక్రమానికి గవర్నర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్‌ చైర్మెన్‌ శివసేనా రెడ్డితో కలిసి జిష్ణుదేవ్‌ వర్మ సైక్లింగ్‌ ర్యాలీని జెండా ఊపి ఆరంభించారు.
గచ్చిబౌలి స్టేడియ నుంచి కేబుల్‌ బ్రిడ్జ్‌ వరకు ఉత్సాహంగా సాగిన సైక్లింగ్‌ ర్యాలీలో సుమారు 1000 మంది సైక్లిస్టులు పాల్గొన్నారు. తెలంగాణ క్రీడాకారులు సాధించిన విజయాలు, స్పోర్ట్స్‌ అథారిటీ ప్రగతిని సూచించే ‘స్పోర్ట్స్‌ పల్స్‌’ మాస పత్రికను ఈ సందర్భంగా గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆవిష్కరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad