Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంగాలి మోటార్‌లో గాలి తిరుగుడు

గాలి మోటార్‌లో గాలి తిరుగుడు

- Advertisement -

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అసెంబ్లీలో ముఖ్యమైన చర్చ జరుగుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి హై కమాండ్‌ను ప్రసన్నం చేసుకునేందుకు గాలిమోటార్‌లో గాలి తిరుగుడు తిరుగుతు న్నాడని కుత్భుల్లాపూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని శాసనసభ మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్యే అజేయుడు, డాక్టర్‌ కె సంజరుతో కలిసి ఆయన మాట్లా డారు. రైతులు యూరియా దొరక్క ఇబ్బంది పడుతున్నా, వినాయక చవితి ఉత్సవాలు జరుగు తున్నా తాము సభకు హాజరు అయ్యామనీ, సీఎం మాత్రం సభా సమయాన్ని వృథా చేస్తున్నా రని విమర్శించారు. కుర్చీ కాపాడు కునే ధ్యాసే తప్ప ప్రజల సమస్యలు ఆయనకు పట్టడం లేదని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీనీ, కేసీఆర్‌ను బదనాం చేయడానికి మాత్రమే సభ పెట్టారని తెలిపారు. ఆత్మ స్తుతి, పర నింద కోసం మాత్రమే అసెంబ్లీని సమా వేశాలు పెట్టారని దుయ్యబట్టారు. పీసీ ఘోష్‌ కమిషన్‌ కేవలం కాంగ్రెస్‌ పార్టీ వేసిన కమిషన్‌ మాత్రమేనని విమర్శించారు. హైకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత సుమారు 665 పేజీల నివేదిక ఇచ్చారని తెలి పారు. అధికార మదంతో తనకు తిరుగులేదన్నట్టు ముఖ్య మంత్రి వ్యవహరిస్తు న్నారని విమర్శించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad