నవతెలంగాణ-హైదరాబాద్: జమ్ముకశ్మీర్ రియాసి జిల్లాలోని సలాల్ ప్రాజెక్టు గేట్లును ఎత్తి వేశారు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చీనాబ్ నదికి వరద నీరు భారీ స్థాయిలో చేరుకుంటుంది. ఈక్రమంలో సలాల్ ప్రాజెక్టులో నీటి మట్టం రోజురోజుకు పెరిగిపోతుంది. దిగువకు వచ్చే వరదలను నివారించడానికి ముందుజాగ్రత్త చర్యలో భాగంగా ఆ రిజర్వాయర్ గెట్లును ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
ప్రతికూల వాతావరణం కారణంగా వైష్ణో దేవి యాత్ర సోమవారం వరుసగా ఏడో రోజు నిలిపివేయబడింది. కాట్రాలోని బేస్ క్యాంప్ నిర్మానుష్యంగా కనిపించింది. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, సంబంధిత సంస్థల నుండి అనుమతి పొందిన తర్వాతే యాత్రకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ఆగస్టు 27న, కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షపాతం కారణంగా శ్రీ మాతా వైష్ణో దేవి యాత్రను నిలిపివేశారు.