- Advertisement -
- – కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య
- నవతెలంగాణ-మల్హర్ రావు
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లసై అసెంబ్లీలో తీర్మానం చేయడం హర్షణీయమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, మాజీ వైస్ ఎంపిపి బడితేల స్వరూప-రాజయ్య దంపతులు అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలో మాట్లాడుతూ.. మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీదర్ బాబు బిల్లు ప్రవేశపెట్టడగా తీర్మానం చేయడాన్ని బీసీ సమాజం సంపూర్ణంగా స్వాగతించడం హర్షణీయమన్నారు. దేశానికి తెలంగాణ ప్రభుత్వం దిక్సూచి అయిందని, బీసీలను కేవలం ఓటు బ్యాంక్ గా చూశారని, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు పాలించే అధికారం కోసం రిజర్వేషన్లు కల్పిస్తోందని, బీసీలు ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు.బిసిల చిరకాల వాంఛ నెరవేరిందన్నారు.
- Advertisement -