Monday, September 1, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణ.. నల్ల బ్యాడ్జిలతో నిరసన

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణ.. నల్ల బ్యాడ్జిలతో నిరసన

- Advertisement -

నవతెలంగాణ – డిండి: కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణ లో కేసు సిబిఐ కి అప్పగించడం పై దిండి మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియచేస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ డిండి పట్టణ అధ్యక్షులు గిరమోని శ్రీనివాసులు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీపై కక్ష సాదింపు చర్యలు చేస్తుందన్నారు. అందులో భాగంగానే కాలేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా కేసును సిబిఐకి అప్పజెప్పిందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో  బలముల తిరుపతయ్య, పున్న లింగమయ్య, మూడవత్ జైపాల్ , గుర్రం సురేష్, ఎండి రషీద్, కాసుల ఐలేష్ చారి,  ఎండి బాషీద్, గొడుగు శ్రీశైలం, మొయినుద్దీన్, బలమూరు లక్ష్మయ్య, చంద్రయ్య గౌడ్, రామచంద్రం, ఎండి ఖలీల్, పానుగంటి దేవేందర్, నజీర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad