నవతెలంగాణ – కామారెడ్డి: గత ఐదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు వలన కామారెడ్డి నుంచి సిరిసిల్ల వెళ్లే బ్రిడ్జి పై నుంచి అధిక వరద వెళ్ళి బ్రిడ్జి చెడిపోయి రాకపోకలు ఆగిపోయినందున ఈ బ్రిడ్జిని సోమవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ క్షేత్రస్థాయిలో పరిశీలించి తాత్కాలిక రోడ్డు నుండి రాకపోకలు ప్రారంభించేలా త్వరగా మరమ్మతులు పనులు పూర్తి చేయాలనీ, తదుపరి రానున్న రెండు, మూడు రోజులు జిల్లాలో అధిక వర్ష సూచన ఉన్నది కావున ఇట్టి రోడ్డుకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్ అండ్ బి ఈఈ మోహన్ ను ఆదేశించారు. తదుపరి పల్వంచ గ్రామంలో సానిటేషన్ ను పరిశీలించి ఎక్కడ అపరిశుభ్ర పరిస్థితులు లేకుండా పగద్భాందిగా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో ను ఆదేశించారు. పల్వంచ గ్రామంలో అధిక వర్షాల వలన కూలిన ఇండ్లను పరిశీలించారు. వాటికి సంబంధించిన ఆర్థిక సహాయం మంజూరుకు సంబంధించి బిల్లులు త్వరగా పంపాలని తహసీల్దార్ ని ఆదేశించారు. జిల్లాలో రేపటి నుంచి అధిక వర్షం పడే అవకాశం ఉన్నందున సిబ్బంది అందరూ నిరంతరం అప్రమత్తంగా ఉండి ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడాలనీ తాసిల్దార్ ని ఆదేశించరు. ఏదైనా అత్యవసరమైతే తప్ప బయటకి వెళ్ళొద్దని ప్రజలకు సూచించినారు. అలాగే అంగన్వాడీ కేంద్రం ను సందర్శించి వంట గదిని పరిశీలించి పిల్లలకు పరిశుభ్రంగా వండి వేడి పౌష్టికాహారం అందించాలని సూచించారు. అంగన్వాడీ చిన్నారులను ఎత్తుకొని ముద్దుచేశారు.
వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES