- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దుద్దిళ్ల శ్రీపాదరావు ఆల్‌ఇండియా ఫిడె అండర్-1600 రేటింగ్ టోర్నమెంట్ విజేతగా ఇ.జోయెల్ నిలిచాడు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో పలు రాష్ట్రాల నుంచి 784 మంది ప్లేయర్లు పోటీపడ్డారు. అండర్-15 విభాగంలో జోయెల్ 9 రౌండ్లలో 9 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. షేక్ హసన్ 8 పాయింట్లతో రన్నరప్‌గా నిలువగా, మనీశ్ రెడ్డి 8 పాయింట్లతో మూడో స్థానం సాధించాడు. రాష్ట్ర చెస్ సంఘం అధ్యక్షులు లక్ష్మీరెడ్డి, హైదరాబాద్ చెస్ సంఘం అధ్యక్షుడు కెఎస్ ప్రసాద్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
- Advertisement -