Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంకార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటం

కార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటం

- Advertisement -

జేకే ఫ్యాక్టరీ ఉద్యోగులకు వేతనాలు, గ్రాట్యుటీ తక్షణమే చెల్లించాలి
రాజస్థాన్‌ సర్కార్‌ బాధ్యత తీసుకోవాలి : సీపీఐ(ఎం) మాజీ ఎంపీ బృందాకరత్‌ డిమాండ్‌
కోటా:
జేకే ఫ్యాక్టరీ కార్మికుల హక్కులు, డిమాండ్లను పరిష్కరించని పక్షంలో రాజీలేని పోరాటం చేస్తామని సీపీఐ(ఎం) మాజీ ఎంపీ బృందాకరత్‌ స్పష్టం చేశారు. ఆ ఫ్యాక్టరీలోని 4200 మంది కార్మికులకు పెండింగ్‌లో ఉన్న రూ.500 కోట్ల వేతన బకాయిలు, గ్రాట్యుటీని చెల్లించేలా రాజస్థాన్‌ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. రెండ్రోజుల పర్యటనకు వచ్చిన బృందాకరత్‌ కోటా డివిజన్‌కు చేరుకుని జేకే టైర్‌ కార్మికుల ఆందోళనకు మద్దతు ఇచ్చారు. 1997లో మూసివేసిన జేకే టైర్‌ ఫ్యాక్టరీలోని కార్మికులకు చెల్లించాల్సిన పెండింగ్‌ వేతన బకాయిలు, గ్రాట్యూటీని చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఫిబ్రవరి 18 నుంచి జిల్లా కలెక్టరేట్‌ వద్ద నిరవధిక ధర్నా చేస్తున్నారు. మంగళవారం ధర్నా స్థలంలో జరిగిన సభలో బృందాకరత్‌ పాల్గొని మాట్లాడారు. ఎనిమిది నెలలుగా జేకే టైర్‌ ఫ్యాక్టరీ కార్మికులు రోడ్లపై బైటాయించి.. ఆందోళన చేస్తున్నా బీజేపీ ప్రభుత్వం బేఖాతరు చేయటం తగదన్నారు. కోటా ఎంపీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా నుంచి ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ వరకు ఎవరూ పట్టించుకోకపోవటం బాధాకరమన్నారు. ఓవైపు పెట్టుబడుల పేరుతో ప్రభుత్వం పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తూ కోట్లు గుమ్మరిస్తోందని, ఏండ్ల తరబడి మూతపడిన జేకే టైర్‌ ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నా దానిపై దృష్టి పెట్టకపోవడం విచారకరమని అన్నారు.

కార్మికులకు ఇవ్వాల్సిన పెండింగ్‌ బకాయిలు, వారి ఉద్యోగాలను కాపాడటానికి ఎర్రజెండా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) కోటా జిల్లా కార్యదర్శి హబీబ్‌ఖాన్‌, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమా శంకర్‌, న్యాయవాది మహ్మద్‌ అక్రమ్‌, నరేంద్రసింగ్‌, రాజీవికా సఫ్‌దా కరంచారి యూనియన్‌ సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గుడ్డిబాయి, మహిళా కమిటీ జిల్లా అధ్యక్షురాలు రజనీ శర్మ, మాజీ అధ్యక్షురాలు పుష్పా, కిసాన్‌ సభ జిల్లా కార్యదర్శి హన్‌త, సీపీఐ(ఎం) తహసీల్‌ సెక్రెటరీ ముకుత్బిహారీ జంగం, బాబులాల్‌ బల్వానీ, సూరజ్మల్‌ బైర్వా, ప్రేమ్‌ పీటర్‌, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి మురారీలాల్‌ బైర్వా, అలీ మహ్మద్‌, అశోక్‌ సింగ్‌ జాకీర్‌ హుస్సేన్‌, మహావీర్‌ ప్రసాద్‌, లతుర్లాల్‌, కేలీచరణ్వీ, కె. కోట, బండి, బరాన్‌, ఇటావా ప్రాంతాలకు చెందిన బూండీ, వేలాది మంది కార్మికులు, రైతులు, మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad