- Advertisement -
- వాటాల పంపకాలతో అంతర్గత కుమ్ములాటలు : టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎమ్మెల్సీ కవిత పాత్రతో కల్వకుంట్ల కుటుంబం కొత్త నాటకానికి తెరదించిందని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్ విమర్శించారు. వాటాల పంపకాల వల్లే ఆ దొంగల ముఠా మధ్య అంతర్గత కుమ్ములాటలు తలెత్తేయని తెలిపారు. కవిత రూపంలో కేసీఆర్‌ను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్ లో ఎంపీలు అనిల్‌కుమార్ యాదవ్, మల్లు రవి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, సాట్ చైర్మెన్ శివసేనారెడ్డితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్టు కాళేశ్వరం అవినీతికి కేసీఆర్ అనుమతి లేదా? అని ప్రశ్నించారు. కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలే నిజమైతే ఆనాడు హరీశ్‌రావుపై కేసీఆర్ చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ కోవిదుడు పీసీ. ఘోష్ పరిపూర్ణంగా విచారణ జరిపి వాస్తవాలను వెలికితీశారని తెలిపారు. అనంతరమే ఆయన కేసీఆర్, హరీశ్‌రావులను దోషులుగా తేల్చిందని చెప్పారు. కమిషన్ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో చర్చించిన అనంతరమే ఆ కేసును సీబీఐకి అప్పగించిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ తానేనంటూ చెప్పుకున్న కేసీఆర్ అందులో జరిగిన అవినీతికి కూడా బాధ్యత వహించాలని హెచ్చరించారు. నిన్నమొన్నటిదాకా కేటీఆర్‌పై ఆరోపణలు చేసిన కవిత తన అస్త్రాన్ని హరీశ్‌రావుపై మళ్లించడం వెనుక అంతర్యమేంటని ప్రశ్నించారు. త్వరితగతిన సీబీఐ విచారణ పూర్తి చేసి బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కరాటే విజేతలకు మహేశ్‌కుమార్ అభినందనలు
బెంగుళూరులో జరిగిన నాలుగోవ సౌత్ ఇండియా కరాటే ఛాంపియన్ షిప్-2025 పోటీల్లో విజేతలుగా నిలిచిన వారిని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ ఘనంగా సన్మానించారు.
- Advertisement -