Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఇందిరా మహిళా శక్తి మోడల్, ఐసిటి సెంటర్లను ప్రారంభించిన  ఎంపీ, ఎమ్మెల్యే..

ఇందిరా మహిళా శక్తి మోడల్, ఐసిటి సెంటర్లను ప్రారంభించిన  ఎంపీ, ఎమ్మెల్యే..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇందిరా మహిళా శక్తి మోడల్ (సిఎస్సి), ఐసిటి  సెంటర్ ను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి , జిల్లా కలెక్టర్ హనుమంతరావులు ప్రారంభించారు. మంగళవారం జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ   ఆద్వర్యములో సి ఎస్ సి -ఎస్ పి వి , సీఎస్ఈ ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఐటి, భారత ప్రభుత్వం, సెర్ప్ గ్రామీణ పేదిరిక నిర్మూలన సంస్థ సహకారముతో  ఇందిరా మహిళా శక్తి మోడల్ , ఐసిటి  సెంటర్లు జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సముదాయములో , తహశీల్దార్ కార్యాలయము లో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భువనగిరి నందు రెండు సెంటర్లలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి  , భువనగిరి శాసన సభ్యులు  కుంభం అనీల్ కుమార్ రెడ్డి తో కలసి ప్రారంభించినారు.

  పార్లమెంట్ సభ్యులు  చామల కిరణ్ కుమార్ రెడ్డి  మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ కార్యక్రమం ద్వారా స్వయం సహాయక సంఘాలు ఆధ్వర్యంలో డిజిటల్ సేవలు, బ్యాంక్ లావాదేవీలు , ప్రభుత్వ పథకాలు గ్రామస్థాయిలో అందించబడతాయని అన్నారు. గ్రామీణ మహిళలను గ్రామ స్థాయి వ్యాపారవేత్తలుగా  తీర్చిదిద్దడం, డిజిటల్ సర్వీస్ సెంటర్ల ద్వారా ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్, విద్య, ఆరోగ్యం, నైపుణ్య శిక్షణ వంటి సేవలు అందించడం, మహిళలకు స్థిరమైన ఆదాయం కల్పించడం, గ్రామీణ కుటుంబాలకు డిజిటల్ ప్రాప్తి పెంచడం, పి ఎం ఈ జిపి, పీఎం వై, ఎమ్మెస్ ఎం ఈ , రాజీవ్ యువ వికాసం వంటి పథకాల ద్వారా మహిళలకు రుణ సాయం, వ్యాపార అవకాశాలు కల్పించడం మొదలగు కార్యక్రమాలు నిర్వహించబడుతాయని అన్నారు.

భువనగిరి శాసన సభ్యులు కుంభం అనీల్ కుమార్ రెడ్డి  మాట్లాడుతూ  ప్రభుత్వము ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ సెంటర్ల ద్వారా ప్రభుత్వ సేవలు: ఆధార్, బిల్లులు, సర్టిఫికెట్లు, పెన్షన్లు, సంక్షేమ పథకాలు. బ్యాంకింగ్ సేవలు, అకౌంట్ ఓపెనింగ్, డిపాజిట్లు, విత్డ్రాయల్స్, మైక్రో-ఏటీఎం, న్సూరెన్స్.సామాజిక సేవలు: డిజిటల్ లిటరసీ, నైపుణ్య శిక్షణ, సూక్ష్మ వ్యాపార సహాయం. లాంటి  830 రకాల ఆన్ లైన్ సేవలు నిర్వహించడము చాలా బాగుంది  అని తెలిపారు.

జిల్లా కలెక్టర్  హన్మంత రావు  మాట్లాడుతూ.. ప్రభుత్వము ప్రతిష్టాత్మకముగా తీసుకున్న ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం లో భాగముగా జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయములో మహిళా శక్తి క్యాంటీన్ , సిఎస్సి  సెంటర్, రూ.5.00 కోట్లతో నిర్మితము అవుచున్న జిల్లా సమాఖ్య  భవనము ఒకే చోట ఏర్పాటు చేసి తద్వారా  మహిళలకు ఇచ్చే ప్రాదాన్యతను వివరించారు.ఈ కార్యక్రమ లో జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు, డిఆర్డిఓ నాగిరెడ్డి, జడ్పీ  సీఈఓ శశోభారాణి, రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణా రెడ్డి , సి ఎస్ సి  వైస్ ప్రెసిడెంట్ స్టేట్ హెడ్ విగ్నేష్ సొర్న మోహన్,  రాష్ట కో ఆర్డినేటర్  కె సునీల్ రెడ్డి,  జిల్లా మేనేజర్  బుగ్గ శ్రీధర్ , మహిళా సంఘముల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad