నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలం బస్వాపురం గ్రామంలోని ఉసిల్ల వాగు పైనుండి ప్రయాణికులు రాకపోకలు కొనసాగించడానికి ” హై లెవెల్ బ్రిడ్జిని ” నిర్మాణం చేపట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సీపీఐ(ఎం) బస్వాపురం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఉసిల్ల వాగు పై హై లెవెల్ బ్రిడ్జిని నిర్మాణం చేయాలని కాల్వపైన ఉన్న చిన్న బ్రిడ్జి పైన నిరసన తెలిపి, మాట్లాడారు. బస్వాపురం గ్రామంతో పాటు ముత్తిరెడ్డిగూడెం, దాతర్ పల్లి గంగసానిపల్లి, జంగంపల్లి రాళ్లజనగాం గ్రామాలకు సంబంధించిన వందలాదిమంది ప్రజలు, వెహికల్స్ నిత్యము జిల్లా కేంద్రమైన భువనగిరితో పాటు వివిధ ప్రాంతాలకు ఈ రోడ్డు వెంటా ప్రయాణం కొనసాగిస్తున్నారని తెలిపారు.
బస్వాపురం ప్రభుత్వ పాఠశాలకు గ్రామ విద్యార్థులతోపాటు హుస్నాబాద్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ, ముంపు గ్రామమైన తిమ్మాపురానికి సంబంధించి అనేకమంది విద్యార్థులు కూడా ఆ రోడ్డులోని ఆవాగు దాటి స్కూలుకు వస్తారని తెలిపారు. వందలాది మంది విద్యార్థులు పై చదువుల కోసం, ఉపాధి కోసం అనేక మంది కార్మికులు, వృత్తిదారులు, పాల, కూరగాయల రైతులు నిత్యము భువనగిరి పట్టణానికి రాకపోకలు కొనసాగిస్తారని వీరందరూ కూడా చిన్నపాటి వర్షం పడిన, బస్వాపురం ప్రాజెక్టు నుండి ముత్తిరెడ్డిగూడెం, రాయగిరి చెరువులోకి కాల్వవ నుండి నీళ్లు వదిలన ఆ వాగు వంతన దాటే పరిస్థితి ఉండదని అన్నారు. వర్షాలు వచ్చినప్పుడు చుట్టూ 15, 20 కిలోమీటర్లు తిరిగి ప్రయాణం కొనసాగించవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వెలిబుచ్చారు.
వాగు వచ్చినప్పుడు దానిని దాటుచుండగా అనేక మంది ప్రమాదాలకు గురవుతున్నారని, వాగు అవతల భాగంలో పంట పొలాలు ఉన్న రైతులు, పాడి రైతులు కూడ ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉసిల్ల వాగుపై హై లెవెల్ బ్రిడ్జిని నిర్మాణం చేయాలని తెలిపారు. హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ విషయం గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం మాటలతో కాలయాపన చేసిందని, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమన్న బాధ్యత తీసుకొని బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని లేకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తామని నర్సింహ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, మండల కార్యదర్శివర్గ సభ్యులు కొండ అశోక్, మండల కమిటీ సభ్యులు మద్యపురం బాల్ నరసింహ, శాఖ కార్యదర్శి మచ్చ భాస్కర్, నాయకులు నరాల చంద్రయ్య, యం.డి బాబు, చిక్కుల రాజు, నరాల కొమరయ్య, దుర్గపతి శ్రీను, చిక్క మహేష్, ఎలగల రాజయ్య లు పాల్గొన్నారు.