Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కామారెడ్డి విద్యుత్ శాఖ అధికారుల తీరే వేరు 

కామారెడ్డి విద్యుత్ శాఖ అధికారుల తీరే వేరు 

- Advertisement -

– విద్యుల్లకు ఎలాంటి అడ్డంకు లేకున్నా చెట్టు తొలగింపు 
– వైల్డ్ అని అల్లుకున్న చెట్లను మాత్రం తొలగించని విద్యుత్ అధికారులు 
– ముక్కున వేలేసుకుంటున్న ప్రజలు 
నవతెలంగాణ –  కామారెడ్డి 

కామారెడ్డి రూరల్ విద్యుత్ అధికారుల చర్యలు వివాదాలకు నెలవుగా మారింది. రాజకీయ నాయకులు ఏది చెప్తే అది చేస్తూ మామూలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. విద్యుత్ వైర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకున్నా ఆ చెట్టును ఓ రాజకీయ నాయకుడు చెప్తే తొలగించారు. అదే గ్రామంలో వైల్డ్ అల్లుకున్న చెట్లను మాత్రం ముట్టుకోవడం లేదు దీంతో స్థానిక ప్రజలు విద్యుత్ అధికారుల చర్యల పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డులో రామేశం పల్లె నుండి ఆరేపల్లి క వెళ్లే రోడ్డులో ఓ స్తంభం వద్ద విద్యుత్వాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ చెట్టు ఉంది అయినాప్పటికీ ఆ గ్రామ రాజకీయ నాయకుడు చెప్పగానే ఆ చెట్టును విద్యుత్ అధికారులు జెసిబి తో పడగొట్టారు. ఇది ఇలా ఉంటే రెండో వర్డ్ రామేశ్వరంపల్లి గ్రామం నుండి కామారెడ్డి కి వచ్చే దారిలో విద్యుత్ వైర్లు కనిపించకుండా  చెట్లు అల్లుకపోయాయి అయినాప్పటికీ ఆ చెట్లను విద్యుత్ అధికారులు తొలగించడం లేదు. గత వారం రోజుల క్రితం వచ్చినటువంటి గాలివాన దుమారం వస్తే వైల్రే కాదు స్తంభాలు సైతం విరిగే అవకాశం ఉన్నప్పటికీ వాటి జోలికి మాత్రం విద్యుత్ శాఖ అధికారులు వెళ్లడం లేదు, ఆ రాజకీయ నాయకునికి విద్యుత్ అధికారులకు మాత్రం ఇతరులపై ఉన్న శ్రద్ధ ప్రజలకు సేవ చేయడంపై లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారుల స్పందించి మామూలు వ్యక్తులకు న్యాయం చేయాలని కామారెడ్డి రూరల్ ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad