- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పాట్నాలోని పర్సా బజార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తన్న కారు ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో ఐదుగురు స్పాట్‌లో మృతి చెందారు. మరణించిన వారంతా పాట్నాలోని కుర్జీ, గోపాల్‌పూర్, పటేల్ నగర్ ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -