- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రేమలో మోసపోయి ఓ యువతి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మెదక్(D) శివ్వంపేట(M) తాళ్లపల్లి తాండాలో జరిగింది. బానోత్ కేశ్య కూతురు సక్కుబాయి (21) నారాయణఖేడ్ కు చెందిన కానిస్టేబుల్ సుధాకర్ అలియాస్ సిద్దు గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సక్కుబాయి పెళ్లి చేసుకుందామని అడగడంతో సుధాకర్ దూరం పెట్టాడు. ఫోన్ నెంబర్ బ్లాక్‌లో పెట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె గడ్డి మందు తాగి.. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందింది.
- Advertisement -