Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుశాశ్వత పరిష్కారం చూపిస్తా: సీఎం రేవంత్ రెడ్డి

శాశ్వత పరిష్కారం చూపిస్తా: సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

బాధితుల్ని ఆదుకుంటాం
– కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
నవతెలంగాణ- నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి/ కామారెడ్డి

వరదలతో నష్టపోయిన బాధితులని ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా కల్పించారు. భవిష్యత్తులో భారీ వర్షాలు కురిసినా వరదలు ఇండ్లను ముంచెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన పొలాలను, రోడ్లను, బ్రిడ్జిలను వరదలతో ముంపునకు గురైన కామారెడ్డి లోని జి ఆర్ కాలనీని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ సురేష్ శెట్కార్, ఎమ్మెల్యేలతో ,టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ తదితలతో కలిసి గురువారం పరిశీలించారు.

భారీ వర్షాలు కురవడంతో మంత్రి సీతక్కతో పాటు షబ్బీర్ అలీని, ఎంపీని అలర్ట్ చేసి నేరుగా బాధితులు కలిసి నష్టం అంచనా వేయాలని సూచించినట్టు సీఎం తెలిపారు. ఇటు ప్రజా ప్రతినిధులు అటు అధికారులు కలిసి సమిష్టిగా కృషి చేయడంతో ప్రాణనష్టం నివారించగలిగినట్టు చెప్పారు. అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధుల పనితీరును ఈ సందర్భంగా సీఎం అభినందించారు. వరదలతో నష్టం వాటిల్లిన కుటుంబాలకు తక్షణ సాయం అందేలా చూడాలని కలెక్టర్ కు సూచించారు. అధికారులతో కలిసి సమీక్షించిన తర్వాత బాధితులను తప్పకుండా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ముందుగా లింగంపేట్ మండలంలో కూలిపోయిన బ్రిడ్జిని, కొట్టుకుపోయిన రోడ్లను పరిశీలించారు. తదనంతరం నష్టపోయిన పంటలను పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడారు. ఆదుకుంటామని భరోసా కల్పించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad