Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుఉపాధ్యాయులను సన్మానించిన జాతీయ ఆదర్శ రైతు

ఉపాధ్యాయులను సన్మానించిన జాతీయ ఆదర్శ రైతు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని హాసకొత్తూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులను గ్రామానికి చెందిన జాతీయ ఆదర్శ రైతు గడ్డం పురుషోత్తం సన్మానించారు. పాఠశాలలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులను జాతీయ ఆదర్శ రైతు గడ్డం పురుషోత్తం ఘనంగా సత్కరించారు. ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక పాఠశాల ఉపాధ్యాయులను, గ్రామానికి అనుబంధంగా ఉన్న మారుతి నగర్ పాఠశాలలోని ఉపాధ్యాయులను గడ్డం పురుషోత్తం ఘనంగా సత్కరించి గౌరవిస్తున్నారు.

అందులో భాగంగానే రెండు పాఠశాలల ఉపాధ్యాయులను పూలమాలలు, శాలువాలతో సత్కరించి, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సతీష్ క్యాషియర్ మురళి, విద్యా కమిటీ సెక్రెటరీ వినోద్, కిషన్ గౌడ్, విశ్రాంత ఉపాధ్యాయుడు చారీ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు  వేణుగోపాల్, ఉపాధ్యాయులు అంజద్ సుల్తాన్, పసుపుల ప్రసాద్, ఉపాధ్యాయురాలు సరిత, విద్యా వాలంటీర్లు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad