Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeమానవిఇలా చేద్దాం…

ఇలా చేద్దాం…

- Advertisement -

ఇంట్లోనే తయారు చేసుకోగలిగే క్లీనర్‌తో చాలా సులువుగా విండో ట్రాక్స్‌ శుభ్రం చేసుకోవచ్చు. మరి ఈ క్లీనర్‌ తయారు చేసుకోడానికి ఏయే పదార్థాలు అవసరమో చూద్దాం. ముందుగా ఓ బౌల్‌లో రెండు టేబుల్‌ స్పూన్స్‌ వైట్‌ వెనిగర్‌ పోయాలి. ఓ టేబుల్‌ స్పూన్‌ డిష్‌ వాష్‌ యాడ్‌ చేయాలి. అందులోనే కొన్ని నీళ్లు పోయాలి. ఇలా క్లీనర్‌ క్విడ్‌ తయారవుతుంది. ఇందులో కొంచెం నిమ్మరసం పిండితే ఇంకా ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. నిమ్మకాయలో ఉండే గుణాలు చాలా త్వరగా దుమ్ముని పోగొడతాయి. పైగా బ్యాక్టీరియా, ఫంగస్‌ లాంటివి ఉన్నా కూడా త్వరగా క్లియర్‌ అయిపోతాయి. బొద్దింకలు సహా ఇతరత్రా పురుగులు రాకుండా అడ్డుకోవచ్చు. ఇప్పుడు తయారు చేసుకున్న ఈ లిక్విడ్‌ని ఎలా వాడాలో కూడా చూద్దాం.
తయారు చేసుకున్న లిక్విడ్‌ని ఓ స్ప్రే బాటిల్‌లో పోయాలి. ఈ లిక్విడ్‌ని డోర్‌ ట్రాక్స్‌ పైన స్ప్రే చేయాలి. ప్రతి మూలలోకి ఇది పోయే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మరోసారి ఓ పేపర్‌ తీసుకోవాలి. ఈ ట్రాక్స్‌ లో పట్టే విధంగా పేపర్‌ లేదా మెత్తటి క్లాత్‌ని కట్‌ చేసుకోవాలి. ఇలా కత్తిరించిన పేపర్‌ తోనే ట్రాక్స్‌ ని క్లీన్‌ చేసుకోవాలి. ప్రతి మూలలోనూ పేపర్‌తో బాగా స్క్రబ్‌ చేసుకోవాలి. ఇలా క్లీన్‌ చేసుకోవడం పూర్తైన తరవాత ఓ పాత క్లాత్‌ తీసుకుని ట్రాక్స్‌పై ఉన్న తడిని పూర్తిగా తుడవాలి. ఇలా కాసేపట్లోనే కిటికీలు శుభ్రంగా మారిపోతాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad