నవతెలంగాణ – జుక్కల్
వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవనంలో ఉన్నతస్థాయి సమావేశంలో పరిస్థితులను సమీక్షించారు. ప్రజలను ఆదుకోవడానికి తీసుకోవలసిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారపు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, పొంంగులేటి శ్రీనివాస రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస రెడ్డి, మదన్ మోహన్ రావు, సుదర్శన్ రెడ్డి, కాటిపల్లి వెంకట రమణారెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ తో పాటు పాల్గొన్న ఎమ్మెల్యే తోట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES