నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలో వీర్యాశైవ లింగాయత్ గణేష్ మండపం, ఆర్యవైశ్య గణేష్ మండపంలో విగ్నేశ్వరుణ్ణి జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఏటా వినాయకుని ప్రతిష్టించిన మండపాలను దర్శించుకుంటున్నానని తెలిపారు. ఎటువంటి విఘ్నాలు కలుగకుండా రైతులు, కార్మికులు, కర్షకులు బాగుండాలని మొక్కులు మొక్కుకున్నానని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో జీవితాలు గడపాలని భగవంతుని ప్రార్థించానని అన్నారు. ఈ కార్యక్రమం లో జుక్కల్ మాజీ ఎంపీపీ నీలు పటేల్, మాజీ ఉప సర్పంచ్ బాను గౌడ్, సీనియర్ నాయకులు బొల్లి గంగాధర్, వాస్రే రమేష్ పటేల్,శివాజీ పటేల్, రవి పటేల్, కపిల్ పటేల్, విట్టు పటేల్, కిరణ్ భారత రాష్ట్ర సమితి నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వినాయకుడి మండపాల్లో మొక్కులు తీర్చుకున్న మాజీ ఎమ్మెల్యే షిండే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES