Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్చలో హైదరాబాద్ ను జయప్రదం చేయండి..

చలో హైదరాబాద్ ను జయప్రదం చేయండి..

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి, పర్మినెంట్ చేయాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని రేపు సెప్టెంబర్ 7న హైదరాబాద్లో ఐ ఎఫ్ టి యు రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు కార్మికులకు పిలుపునిచ్చారు. 

 పట్టణములోని మామిడిపల్లిలో శుక్రవారం   కరపత్రాలను ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ .. “వేతనము తక్కువ చాకిరి ఎక్కువ”అన్నట్లుగానే పంచాయతీ, మున్సిపల్ కార్మికులు అనేక సంవత్సరాలు చాలీచాలని వేతనాలతో పని చేస్తున్నారని ఆయన తెలిపారు. 2015 సంవత్సరంలో గ్రామపంచాయతీ కార్మికుల పోరాట పలితంగా 9500 లకు వేతనం పెరిగిందని దాసు తెలిపారు. ఒక దిక్కు నిత్యవసర సరుకులు ఆకాశాన్ని అందుతున్నాయని, పెరిగిన ధరల ప్రకారం పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర , కేంద్ర సర్వీస్ లో  పనిచేస్తున్న కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.  కనీస వేతనం 26,000 నిర్ణయించి అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. 51 జీవోనుమల్టీ పర్పస్ విధానాన్ని రద్దుచేసి, కనీస పెన్షన్ 10 వేలు ఇవ్వాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండవ పిఆర్పీ వెంటనే ప్రకటించి, కనీస వేతనాలు సవరించి ఉద్యోగ భద్రత కల్పించాలన ఆయన డిమాండ్ చేశారు. సఫాయి కార్మికులు దేవుళ్ళు అని కీర్తిస్తే సరిపోదని, కార్మికుల జీవన ప్రమాణం 

పెరగదని, పెరిగిన ధరల కనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచి, కార్మికుల బతుకులు వెలుగు నింపాలని ప్రభుత్వాలను ఆయన కోరారు.  కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఐఎఫ్టియు ఆధ్వర్యంలో రేపు  హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ. కృష్ణ అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సదస్సులో ఐఎఫ్టియు జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ అపర్ణ, టి శ్రీనివాస్, ఐఎఫ్టియు జాతీయ నాయకులు బాలన్ హైకోర్టు న్యాయవాది (కర్ణాటక), ప్రతాప్ (ఒడిస్సా), జి భారతి ( ఆంధ్ర ప్రదేశ్) డాక్టర్ అనిమేష్ (ఢిల్లీ) తెలంగాణ ఇఫ్టు రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీనివాస్,తెలంగాణ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, కేజీబీవీ, నాయకులు ప్రసంగిస్తారని తెలిపారు. 

ఈ సమావేశంలో తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు భానుచందర్, నాయకులు నరాటి లక్ష్మణ్,   పోశెట్టి నరేందర్, రాజన్న, గణేష్, శ్రీనివాసరెడ్డి , రాజవ్వ, సాయన్న, గంగమ్మ, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad