Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్జాసనే ప్రవక్త జన్మదినం సందర్బంగా పండ్ల పంపిణీ..

జాసనే ప్రవక్త జన్మదినం సందర్బంగా పండ్ల పంపిణీ..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వారికి జుక్కల్ ముస్లిం సోదరులు, గ్రామ యువకులు కలిసి శుక్రవారం పండ్లు పంపిణీ చేయడం జరిగింది. పంపిణీ అనంతరము ముస్లిం సోదరులు, గ్రామ యువకులు  మాట్లాడుతూ.. జాసనే ఈద్ మీలాద్ ఉన్ నబీ సల్లెల్ల అలైహి వసల్లం ప్రవక్త చెప్పిన మాటలను ప్రతి ఒక్కరు పాటించాలని అన్నారు. ఆయన చెప్పిన సమానత్వం,( స్త్రీ,పురుషులు లింగ బేధం లేకుండా ప్రతి ఒక్కరూ సమానమైనది అని తెలిపారు. అదేవిధంగా మీరు తక్కువ జాతి మీరు ఎక్కువ జాతి అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మనుషులే అని గుర్తించి సమానత్వము అని అన్నారు.

ప్రతి ఒక్కరిలో సమానత్వం , మానవత్వం విభేదాలు లేకుండా ఉండాలని ఆయన కోరారు . అదేవిధంగా మనం కూడా ఉండాలని అన్నారు).  అనాల పిల్లలను ఆదుకోవడం ( ప్రతి ఒక్కరికి చేదుడు వాదుడుగా ఉండటం నేర్చుకోవాలి ఒకరి దగ్గర లేకపోతే మనలో మన దగ్గర ఉన్న దానిలో కొంత ఇవ్వాలని చెప్పడం జరిగింది . ఆయన ఒక ఆలోచన విధానం ప్రతి ఒకరము పాటించాలని తెలిపారు.  తల్లితండ్రులను గౌరవించడం,( తల్లిదండ్రులను గౌరవించాల్సిందిగా తల్లిదండ్రులు లేకపోతే మనం లేమని వారి యొక్క గొప్పతనాన్ని వివరించడం జరిగింది). స్త్రీలను గౌరవించడం ( ఆయన రాకముందు స్త్రీలను పుడితే చంపేసేవారు ఆయన వచ్చిన తర్వాత స్త్రీ ఉంటేనే ఈ ప్రపంచ విస్తారణ జరుగుతుందని , స్త్రీ లేకపోతే మనం కూడా లేమని , సమానత్వము ఉండాలని, ప్రతి స్త్రీని గౌరవించాలి ఆయన చెప్పారు ). ఈ పండుగను ప్రతి సంవత్సరం రబి ఆల్ అవ్వల్ 12 వ తేది రోజున జరుపుకుంటారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ పీర్దోస్, ఎండి. ఫారుక్, ఎండి. హైమద్, షాదుల్ ఇస్మాయిల్ సోహెల్  బజరంగ్, అర్మాన్, అజయ్,కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad