Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుడిఫెన్స్ కాదు… ఇక‌నుంచి వార్ : డొనాల్డ్‌ ట్రంప్‌

డిఫెన్స్ కాదు… ఇక‌నుంచి వార్ : డొనాల్డ్‌ ట్రంప్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పలు విభాగాలు, పాలనా పరమైన అంశాల్లో కీలక మార్పులు చేశారు. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ను ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ వార్‌’ (Department of War)గా మారుస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఎగ్గిక్యూటీవ్‌ ఆర్డర్‌ను ట్రంప్‌ త్వరలోనే పాస్‌ చేయనున్నారు.

1949 వరకు అమెరికా ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్’ అనే పేరుతోనే సైనిక వ్యవహారాలను నిర్వహించేది. రెండో ప్రపంచ యుద్ధం (World War II) తర్వాత .. 1947 జాతీయ భద్రతా చట్టం ప్రకారం ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్’గా మార్చారు. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం మళ్లీ ఆ చారిత్రక పేరును తిరిగి తీసుకురావాలని భావిస్తోంది. ఈ పేరు మార్పుపై త్వరలోనే ప్రకటన వెలువడనుంది. ప్రస్తుతం రక్షణశాఖ మంత్రిగా పీట్ హెగ్‌సెత్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో ఆయన్ని ఇకపై డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ వార్‌ మినిస్టర్‌గా పిలవనున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad