Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుమూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ మా లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి

మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ మా లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి

- Advertisement -

– యువ తెలంగాణ ప్రపంచంతో పోటీ పడుతుంది
– విద్యారంగంపై ఊహించని రీతిలో పెట్టుబడులు

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రైజింగ్- 2047, మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు తెలంగాణ యువ రాష్ట్రం వేగంగా పరుగులు తీస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం ఆయన గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (isb)లో మోతిలాల్ ఓస్వాల్ ఎగ్జిక్యూటివ్ సెంటర్ ప్రారంభోత్సవం అనంతరం ప్రసంగించారు. యువ రాష్ట్రం ప్రపంచంతో పోటీపడుతుంది రాష్ట్ర అభివృద్ధికి ISB విద్యార్థులు సహకరించాలని డిప్యూటీ సీఎం కోరారు.


రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై ఎవరు ఊహించని రీతిలో పెట్టుబడులు పెడుతుందని తెలిపారు. విద్య పై పెట్టుబడి రాష్ట్ర నిర్మాణానికి ఉపయోగపడుతుందని ప్రజా ప్రభుత్వం సంపూర్ణంగా భావిస్తుందని వివరించారు. రాష్ట్ర విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను పూర్తి గా ఉచితంగా అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ప్రారంభిస్తున్నాం అన్నారు. 25 ఎకరాల విస్తీర్ణంలో 200 కోట్ల పెట్టుబడితో ఒక్కో పాఠశాల నిర్మిస్తున్నాం, రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 104 పాఠశాలల నిర్మాణం ప్రారంభించినట్టు వివరించారు. విద్యార్థులు కళాశాల బయటికి వెళ్ళగానే ఉద్యోగం పొందేలా స్కిల్ యూనివర్సిటీలో సిలబస్ రూపొందించి అమలు చేస్తున్నట్టు తెలిపారు. స్కిల్ యూనివర్సిటీలో సిలబస్ ఎలా ఉండాలి అనేది పారిశ్రామికవేత్తలతో మాట్లాడి డిజైన్ చేసినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.

తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న చాకలి ఐలమ్మ పేరిట మహిళా యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఆనంద్ మహీంద్రా వంటి దిగ్గజాన్ని చైర్మన్ గా నియమించి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని ఐ ఎస్ బి నిర్వాహకులు స్కిల్ యూనివర్సిటీని, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ను సందర్శించి వాటికి అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వాలని డిప్యూటీ సీఎం కోరారు. అవి ప్రారంభ దశలో ఉన్నందున ఇప్పుడు ఐ ఎస్ బి నుంచి సూచనలు అందితే అది రాష్ట్ర భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఐ ఎస్ బి విద్యార్థులు గొప్ప అదృష్టవంతులు ఒక్కో తరగతి గది 1.50 కోట్ల నుంచి రెండు కోట్ల వరకు వెచ్చించి నిర్మించారు. తాను ఒకటి నుంచి ఐదో తరగతి వరకు సింగిల్ టీచర్ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకున్నానని, రాసుకునేందుకు పలకలు కూడా లేక పోవడంతో మా గురువులు ఇసుక పైనే అక్షరాలు దిద్దిన సందర్భాన్ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. గురుపూజ దినోత్సవం రోజు ఐ ఎస్ బి వంటి గొప్ప విద్యాలయంలో ఎగ్జిక్యూటివ్ సెంటర్ ప్రారంభించుకోవడం అభినందనీయం అన్నారు. తాను ఈ స్థానానికి రావడానికి కృషి చేసిన గురువర్యులందరికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో, ఆశయాలు మరియు ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే మోతీలాల్ ఓస్వాల్ ఎగ్జిక్యూటివ్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం తనకు గౌరవంగా, సంతోషంగా ఉంది అన్నారు. ఈ రోజు మనం కేవలం దాతృత్వాన్ని కాదు, దానిని మించే ఒక భావాన్ని సాక్షాత్కరిస్తున్నాం అన్నారు. మోతీలాల్ ఓస్వాల్ ఫౌండేషన్ ఇచ్చిన సహకారం ఒక విరాళం మాత్రమే కాదు, అది జ్ఞానం, నాయకత్వం, మరియు మన సమిష్టి భవిష్యత్తుపై ఉంచిన విశ్వాసానికి ప్రతీక అన్నారు. మనం తరచూ ప్రభుత్వాలు రోడ్లు కడతాయి అంటాం, కానీ దూరదృష్టి ఉన్న దాతృత్వం మాత్రం నేర్చుకునే ద్వారాలను నిర్మిస్తుంది. అలాంటి ద్వారం మన ముందుకు తెరిచినందుకు మోతీలాల్ ఓస్వాల్ కు ధన్యవాదాలు తెలిపారు. ISB అనేది అలాంటి ద్వారాల ప్రభావానికి సజీవ సాక్ష్యం.


వయస్సులో చిన్నదే అయినా, ఖ్యాతిలో విశిష్ట స్థానంలో నిలిచింది. ఇది ప్రపంచ స్థాయిని, స్థానిక సందర్భాన్ని సమన్వయం చేసిందనీ వివరించారు. ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ అనేది అక్షరాభ్యాసం కాదు, అది నమ్మకాన్ని పదును పెట్టడం, ప్రతిసారి నేర్చుకుంటూ అమలు చేసే చక్రాన్ని ఆపకుండా ఉంచడం అన్నారు. ఇక్కడికి వచ్చే నాయకులు కేవలం సమకాలీనంగా ఉండరు, చాలా సార్లు వారు కొత్త దిశను చూపిస్తారు అన్నారు. గత ఒక్క సంవత్సరంలోనే ISB దాదాపు 200 ప్రోగ్రాముల ద్వారా 6,000 మందికి పైగా ప్రొఫెషనల్స్‌ను శిక్షణ ఇవ్వడం గొప్ప విషయం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ISB నీ ఒక విద్యాసంస్థ గానే కాదు, భాగస్వామి గా చూస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య అధికారులకు శిక్షణ ఇవ్వడం నుండి, చేతివృత్తులు, ఎన్నికలు లేదా మెట్రో రైలు వంటి రంగాలపై స్వతంత్ర అధ్యయనాలు నిర్వహించడం వరకు, ISB తన పరిశోధన ద్వారా విధానాలను ఎలా మలచవచ్చో చూపిందనీ తెలిపారు. ముఖ్యంగా, సెంటర్ ఫర్ అనలిటికల్ ఫైనాన్స్ మాతో కలిసి “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో భాగస్వామ్యం అవుతోంది, —మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు మా ప్రయాణం.


విధానాన్ని హామీగా, హామీని పురోగతిగా మార్చుకుంటూ ముందుకు సాగుతున్నాం అని డిప్యూటీ సీఎం వివరించారు. ఇవాళ మనం విఘాతం (disruption) సాధారణం అయ్యిన కాలంలో జీవిస్తున్నాం, డిజిటలైజేషన్, సస్టైనబిలిటీ, సమానమైన వృద్ధి. ఇవి ఏవీ ఒంటరిగా పరిష్కరించలేం అన్నారు. ప్రభుత్వం విధానాన్ని, దృష్టిని ఇస్తుంది, పరిశ్రమ వనరులు, అమలు ఇస్తుంది, విద్యాసంస్థలు జ్ఞానం, పరిశోధన ఇస్తాయి, ఈ మూడూ కలిసినప్పుడు మాత్రమే నిజమైన పరివర్తన సాధ్యం అవుతుందనీ డిప్యూటీ సీఎం తెలిపారు. అందుకే ఈ కొత్త ఎగ్జిక్యూటివ్ సెంటర్ ఒక భవనం మాత్రమే కాదు, ఇది క్లాస్‌రూమ్‌లు, బోర్డు రూమ్‌లు, ప్రభుత్వ కార్యాలయాలు కలిసే ఒక కుళాయిలా (crucible) మారి, ఆలోచనలను పరిష్కారాలుగా మలిచే స్థలం అవుతుందనీ విశ్వాసం వ్యక్తం చేశారు. తదుపరి దశాబ్దం భారతదేశానికి నిర్ణాయకం.


తెలంగాణ ISB వంటి సంస్థలతో, యంగ్ ఇండియా వంటి కార్యక్రమాలతో మార్పులో భాగమవడమే కాకుండా, దానికి నాయకత్వం వహించాలని సంకల్పించిందన్నారు.
దాదాపు 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ సెంటర్, లెక్చర్ హాల్స్, చర్చా స్థలాలు, మౌనంగా ఆలోచించడానికి మూలలు, ఆ ఆశయానికి ఓ నంగరంలా నిలుస్తుందన్నారు. ఈ సెంటర్‌ను ప్రారంభిస్తున్న సందర్భంలో, సహకారం అనే కొత్త యుగాన్ని కూడా ప్రారంభిద్దాం, రాష్ట్రం, విద్యాసంస్థలు, పరిశ్రమ కలిసి భారతదేశ భవిష్యత్తును మలచే మార్గంలో పయనిద్దాం అని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ దారిలో ధృఢ నిశ్చయంతో నడుస్తుందనీ తెలిపారు. విద్య అనేది కేవలం ప్రొఫెషనల్స్ తయారు చేయడమే కాకుండా, సమాజం కోసం, మానవత్వం కోసం నాయకులను తీర్చిదిద్దాలన్నది మా ప్రజా ప్రభుత్వ సంకల్పం అని తెలిపారు.


ఈ సెంటర్ భవిష్యత్ తరాలకు దిక్సూచి ఇలా మారి, వారిని అగ్రగామిత్వం, సమానత్వం, ఆవిష్కరణల వైపు దారి చూపాలని కోరుకుంటున్నాను అన్నారు.
స్కిల్స్ యూనివర్సిటీ ఇప్పటికే ప్రారంభమై, తొలి సంవత్సరంలోనే వందలాది విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది. 2025 నాటికి దాని శాశ్వత కాంపస్ “ఫ్యూచర్ సిటీ”లో ఏర్పడుతుంది.
అలాగే, మొదటి దశలో 58 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ₹11,000 కోట్లకు పైగా పెట్టుబడితో, విద్యార్థులను సమగ్రంగా తీర్చిదిద్దడానికి, అకాడమిక్‌ నుంచి పోటీ పరీక్షల వరకు నిర్మితమవుతున్నాయి. మీ సహకారం- మార్గదర్శకత్వం, నిధులు లేదా భాగస్వామ్యం రూపంలో వాటి ప్రభావాన్ని మరింత పెంచి, ఈ రోజు మనం జరుపుకుంటున్న రాష్ట్రనిర్మాణం (nation-building) భావనను మరింత విస్తరించగలదనీ డిప్యూటీ సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సెంటర్ మనకు ఒక సత్యాన్ని గుర్తు చేస్తుంది, ఎంత సీనియర్ అయినా నేర్చుకోవడం ఆగదు.
కొన్నిసార్లు, ఉత్తమ నాయకులు అంటే ఉత్తమ విద్యార్థులే అని డిప్యూటీ సీఎం వివరించారు.


ఈ సెంటర్ కేవలం MBAలు, CEOలు మాత్రమే కాకుండా భారతదేశం గర్వపడేలా సమస్యలకు పరిష్కారాలు కనుగొనే వ్యక్తులను తయారు చేయాలి అన్నారు. నేర్చుకోవడం ఎప్పటికీ ముగియదని మనకు గుర్తు చేస్తే, తాను కూడా ఐ ఎస్ బి లో విద్యార్థిగా అడ్మిషన్ తీసుకోవాలని భావిస్తున్నానని isb డీన్ మదన్ గమనించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం నేర్చుకోవడానికి ఇష్టపడతారని, రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ISB లో ఐదు రోజులపాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయాలని నిర్వాహకులను డిప్యూటీ సీఎం కోరారు. కార్యక్రమంలో మోతిలాల్ ఓస్వాల్ డీన్ మదన్ పిల్లుట్ల, ప్రభాత్ సిన్హా, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad