Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంకేరళ సంస్కృతికి ప్రతీక ఓనం

కేరళ సంస్కృతికి ప్రతీక ఓనం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఓనం.. కేరళ సంస్కృతికి ప్రతీక . కేరళ సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయనికి ముడిపడిన పండుగే ఓనం. ఈ పండుగను పది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటుంటారు. ఇక ఈ పండుగ‌ను కేరళ ప్రజలే కాకుండా.. త‌మిళ‌నాడు, కర్ణాటక సహా పలు రాష్ట్రాల ప్రజలు కుడా ఏటా ఎంతో ఘనంగా జరుపుకుంటుంటారు.

ఈ పండుగ సందర్భంగా కేరళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా.. ఏనుగుల స్వారీలు, తెల్లటి దుస్తుల్లో మగువలు, రకరకాల పూలతో సుందరంగా చేసిన అలంకరణలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంటాయి. ముఖ్యంగా ఆడపిల్లలు రకరకాల పువ్వులను సేకరించి వాటితో ఇంటి ముందు అందమైన ముగ్గు వేసి ఆ మధ్యలో దీపం వెలిగిస్తారు. దీన్ని మలయాళంలో పూక్కలం అంటారు. ఓనం సందర్భంగా కేరళలో రంగవల్లులపై పోటీలు కూడా నిర్వహిస్తుంటారు.

ఇక ఈ పండుగ రోజున మలయాళీలు నిర్వహించే ఓనసద్యా అనే విందు చాలా ముఖ్యమైనది. ఈ విందులో సాధారణంగా అరటి ఆకులపై పలు రకాల ఆహార పదార్థాలు వడ్డిస్తారు. సంప్రదాయ ఊరగాయలు, అప్పడాలు, పాయసం, పప్పు, అన్నంతోపాటు రకరకాల పిండివంటలను చేసుకుని కుటుంబమంతా కలిసి ఆరగిస్తారు.

ఈ పండుగలో పూజలు, ముగ్గులు, పిండి వంటలే కాదు.. సంప్రదాయబద్ధమైన కట్టూబొట్టుకూ ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా కసావు స్టైల్‌ చీరకట్టుకు ఈ పండుగలో ఎంతో ప్రత్యేకత ఉంది. బంగారు వర్ణంతో మెరిసిపోయే ఈ చీరకు రంగురంగుల డిజైనర్‌ బ్లౌజుల్ని జతచేసి బుట్టబొమ్మల్లా మెరిసిపోతుంటారు కేరళ కుట్టీలు. అంతా ఓచోట చేరి ఊయలలు ఊగుతూ, సంప్రదాయ పాటలకు నృత్యాలు చేస్తూ సందడిగా గడుపుతారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad