- Advertisement -
నవతెలంగాణ – భీంగల్
ఈరోజు భారతీయ జనతా పార్టీ భీంగల్ మండలంలో ఎన్నికల సమావేశం వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఇందులో భీంగల్ మండల ఇంచార్జ్ యోగేశ్వర నర్సయ్య స్టేట్ కౌన్సిల్ మెంబర్ మాట్లాడుతూ… త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానునందున ఎన్నికలకు సన్నద్ధం కావాలని దిశ నిర్దేశం చేయడం జరిగింది. ఇందులో మండల అధ్యక్షుడు ఆర్ రవీందర్, కిషన్ మోర్చా అధ్యక్షులు తోట గంగాధర్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, యువ మోర్చా అధ్యక్షుడు సీనియర్ నాయకులు సంధ్యారాజు, అకిం భాయ్, కొట్టాల అశోక్, కిషోర్, అంజయ్య, వెంకటేష్ వివిధ గ్రామాల కార్యకర్తలు, తదితరులు పాల్గొనడం జరిగింది.
- Advertisement -