Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్దేశంలోనే గణేశ్ ఉత్సవాలంటే ఖైరతాబాద్ గణేషుడే: సీఎం రేవంత్ రెడ్డి

దేశంలోనే గణేశ్ ఉత్సవాలంటే ఖైరతాబాద్ గణేషుడే: సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – బంజారాహిల్స్
దేశంలోనే గణేశ్ ఉత్సవాలంటే ఖైరతాబాద్ గణపతి అని చర్చించుకునేలా ఉత్సవాలను నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీని అభినందిస్తూ.. ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలు 71 ఏండ్లు పూర్తి చేసుకుందన్నారు. మహాగణపతి దర్శనం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…దేశంలో ఏ రాష్ట్రంలో, ఏ నగరంలో గణేశ్ మండపాలకు ప్రభుత్వాలు ఉచిత విద్యుత్ ఇవ్వలేదన్నారు. కానీ మన రాష్ట్రంలో గణపతి మండపాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించిందన్నారు. భక్తితో ఉత్సవాలు నిర్వహించుకునే అవకాశం కల్పించాన్నారు.

ఎప్పటికప్పుడు సమస్యలను తెలుసుకుంటూ, అధికారులను సమన్వయం చేస్తూ,సమస్యలను పరిష్కరించుకుంటూ.. ఉత్సవాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూశామని అన్నారు. అన్ని మతాలను గౌరవిస్తూ.. హైదరాబాద్ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఐక్యతే నిదర్శనంగా జరుపుకునే గణేష్ పండుగకు కులం, మతం ఏవీ లేవని నిమజ్జనాలకు ఇబ్బంది, కలగకుండా ట్యాంక్ బండ్ తో పాటు ఇతర ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశామన్నారు.

భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్లూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్, నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మీ, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, జిల్లా కలెక్టర్ హరిచందన తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad