నవతెలంగాణ – భీంగల్
హైకోర్టు జడ్జిగా విధులు నిర్వహిస్తున్న భీంగల్ ప్రాంత వాసి అయినటువంటి గాడి ప్రవీణ్ కుమార్ శుక్రవారం భీంగల్ లోని లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఇటీవలే భీంగల్ కు కోర్టు మంజూరు అయ్యింది. హైకోర్ట్ జడ్జీని లింబాద్రి గుట్ట పైన సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కలసి,అనంతరం భీంగల్ మంజూరు అయిన కోర్టు పనులను వేగవంతం చేయాలని భీంగల్ సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షులు నీలం రవి, ఉపాధ్యక్షులు బర్ల మోహన్ ,క్యాషియర్ కాపు కుమ్మరి హరీష్, సెక్రటరీ పర్సా నవీన్, సలహా కమిటీ సభ్యులు రాగి పవన్, దయ్యా ప్రవీణ్, చింతలూరి దశరథ్ తదితరులు పాల్గొనడం.
భీంగల్ కోర్ట్ పనులు వేగవంతం చెయ్యాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES