నవతెలంగాణ – కామారెడ్డి
ఉద్యమ కెరటం, తెలంగాణ రథసారథి ఆచార్య కోదండరాం జన్మదిన సందర్భంగా ఇలిచిపూర్ సరస్వతి అమ్మవారి దేవాలయంలో పేరు మీద ప్రత్యేక పూజలు చేయడం జరిగిందినీ ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు కుంభాల లక్ష్మణ్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత సేవ చేయాలని ఉన్నతమైన పదవులు పొందాలని బడుగు బలహీన వర్గాల ప్రజలకు మరింత సేవలు అందించే విధంగా శక్తి సామర్థ్యాలు అమ్మవారి ఆశీర్వాదం లభించాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అమ్మవారిని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రజనీకాంత్, ఉపాధ్యక్షులు ఫుల్ సింగ్, నాయకులు రాజు, నవీన్, రవి, గుడి అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
ఆచార్య కోదండరాం జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES