ఎరువుల దుకాణ యజమానికి నోటీస్
నవతెలంగాణ – కాటారం
కాటారం మండల కేంద్రంలోని క్రాంతి కుమార్ ట్రేడర్స్ ఎరువుల దుకాణాన్ని శుక్రవారం వ్యవసాయ శాఖ అధికారిని పూర్ణిమ ఏఈఓ తో కలిసి తనిఖీ నిర్వహించి, రైతుల కోరిక మేరకు యూరియా అమ్మకాలు తక్షణమే నిలిపివేయాలని దుకాణ యజమానికి నోటీస్ జారీ చేశారు.
గురువారం క్రాంతి కుమార్ ట్రేడర్స్ ఫెర్టిలైజర్ షాపులో పంపిణీలో యూరియా అందుబాటులో ఉన్నప్పటికీ రైతులకు యూరియా అందుబాటులో లేదని చెప్పడంతో రైతులకు, ఫర్టిలైజర్ షాపు యజమానికి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం విధితమే. రైతులందరూ కలిసి వ్యవసాయ శాఖ అధికారానికి ఫిర్యాదు చేయగా రైతులతో కలిసి వ్యవసాయ శాఖ అధికారిని ఎరువుల గోదామును తనిఖీ నిర్వహించారు. గోదాములో యూరియా లేకపోవడంతో పక్కదారి పడుతోందని తనిఖీల్లో రైతులు అధికారినికి వివరించారు.
శుక్రవారం వ్యవసాయ శాఖ అధికారిని పూర్ణిమ, ఏఈఓతో కలిసి క్రాంతికుమార్ ట్రేడర్స్ ఎరువుల దుకాణాన్ని తనిఖీ నిర్వహించారు. అమ్మకాల నిర్వహణలో లోపాలు గుర్తించి రైతుల కోరిక మేరకు యూరియా అమ్మకాలు నిలిపివేయాలని నోటీసులు జారీ చేశారు. మూడు రోజులపాటు యూరియా అమ్మకాలు తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. ఎరువుల అమ్మకాలు జరిపే విధానంలో లోపాలాన్ని వెంటనే సవరించి నివేదిక అందించాలని కిందిస్థాయి అధికారులను కోరారు. సమస్యపై స్పందించిన వ్యవసాయ శాఖ అధికారులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.