నవతెలంగాణ హైదరాబాద్: నగరంలోని విద్యానగర్ లో గల వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకురాలు డాక్టరు పద్మజకు తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఈ. ప్రభు తెలిపారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వృక్షశాస్త్ర అధ్యాపకురాలుగా పనిచేస్తున్న డాక్టర్ ఓ. పద్మజ డిగ్రీ విద్యార్థులకు ఆధునిక పద్ధతుల ద్వారా బోధన చేయడంతోపాటు, ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం అధికారిగా విద్యార్థులను సామాజిక సేవలో భాగస్వాములుగా చేసి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారని తెలిపారు. అందుకు గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వము ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును తమ కళాశాల అధ్యాపకురాలికి అందించడం కళాశాలకే గర్వకారణమని ప్రిన్సిపల్ తెలిపినారు. అధ్యాపక బృందము, విద్యార్థిని విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు శుక్రవారం శిల్పారామంలో జరిగిన కార్యక్రమములో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, అధ్యాపక బృందము, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.