Sunday, November 9, 2025
E-PAPER
Homeకరీంనగర్ఎడ్లబండిపై వినాయక నిమజ్జనం

ఎడ్లబండిపై వినాయక నిమజ్జనం

- Advertisement -
  • సంప్రదాయ బద్ధంగా నిర్వహించిన మహేంద్ర యువజన యూత్ సభ్యులు 
  • నవతెలంగాణ – రాయికల్
    రాయికల్ పట్టణంలోని కేశవనగర్ కు చెందిన మహేంద్ర యువజన యూత్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన ఉత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా ఎడ్లబండిపై వినాయకుడిని ఊరేగించడం జరిగింది. సంప్రదాయ పద్ధతుల్లో మహిళలు మంగళహారతులు పట్టి భక్తిశ్రద్ధలతో పాల్గొనగా, డప్పుల వాయిద్యాలు, జైజయధ్వానాలతో పట్టణ పురవీధులు మార్మోగిపోయాయి. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఊరేగింపును మరింత వైభవంగా మార్చారు.చిన్నారులు, యువకులు ఉత్సాహంగా వినాయకుడి ఊరేగింపులో అడుగులు కలిపారు.

    ఊరంతా పండుగ వాతావరణం నెలకొని భక్తి,ఆనందం నిండిన దృశ్యాలు కనిపించాయి. మట్టితో తయారైన వినాయక విగ్రహానికి నవరాత్రి రోజులలో ఘనంగా పూజలు జరిపి, పర్యావరణానికి హాని కలగకుండా, శబ్ద కాలుష్యం లేకుండా నిమజ్జనం నిర్వహించడం అందరిని ఆకట్టుకుంది. ఆధునికతలోనూ సంప్రదాయాన్ని కాపాడుతూ ఎడ్లబండిపై వినాయకుడిని నిమజ్జనం చేయడం ప్రత్యేకంగా నిలిచింది. స్థానిక ప్రజలు ఈ తరహా పర్యావరణహిత నిమజ్జనాలు మరింత ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు. మహేంద్ర యువజన యూత్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -