Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలురేపు మంగంపల్లికి రానున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

రేపు మంగంపల్లికి రానున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

- Advertisement -

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాలకు హాజరు 
పాల్గొననున్న ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా మంత్రులు, ఎంపీ 
ప్రకటన విడుదల చేసిన ఎమ్మెల్యే తూడిమేగా రెడ్డి 
నవతెలంగాణ – వనపర్తి  

వనపర్తి నియోజకవర్గం పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  హాజరవునున్నట్లు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం ఉదయం 9:30 గంటలకు స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులైన పోలేమోని రాధమ్మ w/o రామకృష్ణ ల గృహప్రవేశానికి హాజరై ఆ దంపతులకు నూతన వస్త్రాలను అందజేయనున్నారు.

ఈ కార్యక్రమానికి పెద్దమందడి మండలం, వనపర్తి నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్, పెబ్బేరు మార్కెట్ యార్డ్ చైర్మన్ , వైస్ చైర్మన్ లు, మహబూబ్నగర్ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయాల అధ్యక్షులు, పీసీసీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయకులు, కార్యకర్తలు పార్టీ శ్రేణులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, సింగిల్ విండో అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మాజీ పట్టణ కౌన్సిలర్లు, ఆయా మండలాల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల అధ్యక్షులు, సభ్యులు, మహిళా అధ్యక్షురాలు, మహిళా సంఘం సభ్యురాలు, ఎన్ ఎస్ యు ఐ సంఘం నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad