– జేఏసీ నాయకులు నాగేశ్వరరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
గిరిజన ఆశ్రమ పాఠశాలలు,హాస్టల్లో పని చేసే దినసరి కార్మికుల ప్రస్తుతం ఇస్తున్న వేతనాలు తగ్గించ వద్దని,కార్మికులు ను పర్మినెంట్ చేయలని హాస్టల్ ఆశ్రమ పాఠశాల యూనియన్ జేఏసీ నాయకులు బైట నాగేశ్వరావు డిమాండ్ చేశారు. డైలీ వేజ్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య దోరణి కి నిరసనగా ఈ నెల 12 నుండి రాష్ట్ర వ్యాప్త సమ్మె జరుగుతుంది అని,ఈ సమ్మె విజయవంతం చేయాలని గుమ్మడివల్లి,అనంతరం, సున్నంబట్టి,అశ్వారావుపేట హాస్టల్ ఆశ్రమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు,వార్డెన్ లకు దినసరి కార్మికుల తో కలసి సమ్మె నోటీస్ లు అందజేశారు.
ఈ సందర్బంగా నాగేశ్వరావు మాట్లాడుతూ గత ముప్పై ఏళ్ల గా విధులు నిర్వహిస్తున్నామని,తమ వేతనాలు పెరగటానికి అనేక ఆందోళనలు పోరాటాలు చేశామని,గత ప్రభుత్వం తీసుకువచ్చిన 64 జీవో ను ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రూ.26,800 లు నుండి రూ.11700 రూపాయలు తగ్గించి ఇస్తామని చెప్పడం కార్మికులు ను వెట్టి చాకిరీ కి గురి చేయడమేనని,ఈ విషయం పై ప్రభుత్వాధికారులు దృష్టి కి తీసుకు వెళ్లిన సమస్య పరిష్కారం కాలేదు అని దీనికి నిరసనగా ఈ నెల పన్నెండు నుండి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నిరవధిక సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో బత్తుల శ్రీను,నాగమణి,జెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.